Byelection: బహిరంగ సభలో నిమ్మరసం చేసుకొని తాగిన అసోం సీఎం!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అసోంలోనూ ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ.. భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ
డిస్పూర్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అసోంలోనూ ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ.. భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ బహిరంగసభలో నేతలు, ప్రజల ముందే సీఎం తన స్వహస్తాలతో నిమ్మరసం తయారుచేసుకొని తాగారు.
అసోంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో భబానీపూర్ ఒకటి. ఇక్కడ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫణీందర్ తాలుక్దార్ నిలబడ్డారు. ఆయన నిర్వహిస్తోన్న ఎన్నిక ప్రచార సభలో సీఎం హిమంత బిశ్వా శర్మ కూడా పాల్గొన్నారు. కాగా.. సభవేదిక ఎక్కిన సీఎంకు స్థానిక నేతలు గతి ప్రాంతంలో పండించిన నిమ్మకాయలను ఒక బుట్టలో పెట్టి అందజేశారు.ఇక్కడ పండించే నిమ్మకాయలు మంచి రుచికరమైనవిగా పేరుంది. అనంతరం సభావేదికపైనే కొన్ని నిమ్మకాయలతో నిమ్మరసం చేసుకొని తాగారు. మిగతా వాటిని ఇంటికి తీసుకెళ్తానని, ఈ రోజు తను పడిన కష్టానికి ప్రతిఫలం ఈ నిమ్మకాయలని చమత్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. భబానీపూర్ అభివృద్ధి కోసం భాజపా అభ్యర్థి ఫణీందర్‌ను గెలిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్