UP polls 2022: వారణాశిలో రేపే ఓటింగ్‌.. చివరి దశ పోలింగ్‌కు సిద్ధమైన యూపీ

శాసనసభ చివరి విడత పోలింగ్‌కు ఉత్తరప్రదేశ్‌ సర్వం సిద్ధమైంది. 9 జిల్లాల్లో విస్తరించి ఉన్న 54 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరగనుంది.......

Published : 06 Mar 2022 22:32 IST

లఖ్‌నవూ: శాసనసభ చివరి విడత పోలింగ్‌కు ఉత్తరప్రదేశ్‌ సర్వం సిద్ధమైంది. 9 జిల్లాల్లో విస్తరించి ఉన్న 54 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాశి పరిధిలో రేపే ఓటింగ్‌ జరగనుంది.

తుది దశ పోరులో యూపీ పర్యాటక శాఖ మంత్రి నీల్‌కాంత్ తివారీ బరిలో ఉన్నారు. ఈయన వారణాశి సౌత్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు శివ్​పుర్​-వారణాశి నియోజక వర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాశి నార్త్​ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్​పుర్​ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మీర్జాపుర్​ నుంచి రామశంకర్ సింగ్ పటేల్​ పోటీ పడుతున్నారు. అంతేగాకుండా కేబినెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్‌ వాదీలో చేరిన ధారాసింగ్​ చౌహాన్..​ ఘోశి నుంచి పోటీలో ఉన్నారు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని