అభ్యర్థుల్లో 18 శాతం మంది నేరచరితులే..

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థుల్లో 18 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల కూటమి (ఏడీఆర్‌) తెలిపింది. ఈ మేరకు సదరు నేతలు తమ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది....

Published : 02 Apr 2021 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థుల్లో 18 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల కూటమి (ఏడీఆర్‌) తెలిపింది. ఈ మేరకు సదరు నేతలు తమ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది. వచ్చిన 6,792 అఫిడవిట్లలో 6,318 అఫిడవిట్లను పరిశీలించి ఈ వివరాలను గుర్తించినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. ఈ 6,318 మందిలో 1157 మంది తమపై క్రిమినల్‌ నేరాభియోగాలు ఉన్నట్లు వెల్లడించారని తెలిపింది. అందులో 632 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. తమిళనాడులో అత్యధికంగా 466 మందికి నేర చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 144 మంది, కేరళలో 355 మంది, అసోంలో 138 మంది, పుదుచ్చేరిలో 54 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో పోటీలో ఉన్నవారిలో 1317 మంది కోటీశ్వరులు ఉన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని