UP Elections: రాజ్‌నాథ్‌సింగ్‌కు నిరుద్యోగ నిరసనల సెగ.. హీటెక్కిన ర్యాలీ

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహించిన ర్యాలీలో రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. నియామకాలు చేపట్టాలంటూ యువత నిరసన వ్యక్తం చేశారు.......

Published : 20 Feb 2022 01:53 IST

లఖ్‌నవూ: ఎన్నికల ప్రచారం కోసం ర్యాలీకి ముందు భాజపా సభ ఏర్పాటు చేసింది. వందల సంఖ్యలో కార్యకర్తలు, ఓటర్లు పాల్గొన్నారు. వేదికపై ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. చివర్లో ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించేందుకు పోడియం వద్దకు వెళ్లారు. అంతే అప్పటివరకు నిశ్చబ్దంగా ఉన్న కొందరు ఒక్కసారిగా నిరసనకు దిగారు. ఆర్మీలో నియామకాలు చేపట్టాలంటూ నినదించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహించిన ర్యాలీలో రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.

సభలో మాట్లాడేందుకు రాజ్‌నాథ్‌సింగ్‌ మైక్‌ వద్దకు రాగానే.. కొంతమంది యువత నిరసన తెలపడం ప్రారంభించారు. ‘ఆర్మీలో నియామకాలు చేపట్టండి. మా డిమాండ్లను నెరవేర్చండి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం కొద్దిసేపు ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రక్షణమంత్రి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. నియామకాలు చేపడతామని చింతించొద్దని హామీ ఇచ్చారు. ‘మీ బాధలు మా బాధలే. కరోనా వైరస్‌ కారణంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. చింతించొద్దు అన్నీ జరుగుతాయి’ అంటూ పేర్కొన్నారు. ఈ హామీతో శాంతించిన నిరుద్యోగులు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినదించారు. దీంతో అక్కడి పరిస్థితులు సద్దుమణిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని