Atchannaidu: రాయితీలు ఎత్తివేసి.. జేట్యాక్స్‌తో దోచుకుంటున్నారు: అచ్చెన్నాయుడు

ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌.. ప్రశ్నించిన తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Published : 16 Nov 2022 12:47 IST

అమరావతి: ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌.. ప్రశ్నించిన తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో తెదేపా నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అచ్చెన్న ప్రకటన విడుదల చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్న ఆక్వారంగం నేడు పతనమైందన్నారు. మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షరతుల పేరుతో రాయితీలు ఎత్తివేసి, జేట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని అణచివేయాలనే జగన్ రెడ్డి తీరు.. ఇకపై సాగనివ్వబోమని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు