Atchannaidu: లిక్కర్‌తో రూ.10వేల కోట్ల సంపాదన జగన్‌ టార్గెట్‌: అచ్చెన్నాయుడు

మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఏపీ సీఎం జగన్‌ను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

Updated : 24 Mar 2022 15:23 IST

అమరావతి: మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఏపీ సీఎం జగన్‌ను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం తీసుకొస్తామని.. మద్యం ఆదాయాన్ని తగ్గించుకుంటూ వెళ్తామని జగన్‌ చెప్పలేదా? అని నిలదీశారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఐదేళ్లలో మద్యం ఆదాయంతో రూ.10వేల కోట్ల వ్యక్తిగత సంపాదనను జగన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకే కొత్త బ్రాండ్లు, పాలసీని తెచ్చారని విమర్శించారు. శాసనసభలో సీఎం చెప్పిన ప్రతి మాటా అవాస్తమన్నారు.  

‘‘2014-15లో రూ.11,569 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి. 2021-22లో రూ.24,714 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. రూ.11వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు ఆదాయం పెరిగిందా?లేదా? డిస్టిలరీలను నడుపుతోంది జగన్‌ బినామీలు కాదా? చంద్రబాబు హయాంలో డిస్టిలరీలను తెచ్చారని చెబుతున్న జగన్‌.. వాటిని ఎందుకు రద్దు చేయడం లేదు? తెలుగుజాతి ఉన్నంతవరకు చంద్రబాబు బ్రాండ్‌ ఉంటుంది.. జగన్‌ తరహాలో చంద్రబాబుది చీప్‌ లిక్కర్‌ బ్రాండ్‌కాదు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం. భర్తను చంపి భార్యకు అమ్మఒడి ఇస్తారా? కొడుకున చంపి వారి తల్లిదండ్రులకు పెన్షన్‌ ఇస్తారా? ఇలా ఎక్కడైనా ఉందా? ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన అంశం ఇంకేమైనా ఉందా?’’ అని అచ్చెన్నాయుడు నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని