Atchannaidu: ప్రజాసమస్యలపై గళమెత్తితే దాడులు చేస్తారా?: అచ్చెన్న

చిత్తూరులోని పుంగనూరులో బీసీ వర్గానికి చెందిన జనసేన నేత రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని తెదేపా తీవ్రంగా ఖండించింది. బీసీలపై ముఖ్యమంత్రి జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు.

Published : 06 Dec 2022 01:04 IST

అమరావతి: బీసీలపై ముఖ్యమంత్రి జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీ వర్గానికి చెందిన జనసేన నేత రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రజా సమస్యలపై గళమెత్తితే దాడులు చేస్తారా? సీఎం వ్యవహార శైలి బీసీలను అణచివేసేలా ఉంది. రైతు సమస్యలపై సభ పెట్టడమే నేరమన్నట్లుగా రామచంద్రయాదవ్‌పై దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకానికి, సీఎం జగన్‌ దుర్మార్గానికి ఈ దాడి నిదర్శనం. బీసీలను అణగదొక్కుతూ..‘జయహో బీసీ’ అంటూ సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి ఉందా?  2024లో జగన్ రెడ్డికి బీసీలు సమాధానం చెబుతారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఓ బీసీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు.  రైతు సమస్యలపై సదస్సు నిర్వహించడం తప్పా? . ప్రశ్నిస్తే దాడి చేయడమే వైకాపా నేతలకు తెలిసిన రాజకీయమా? ఓ వైపు బీసీ నేతలపై దాడి చేసి మళ్లీ బీసీ సభ అంటూ డ్రామాలాడటం సిగ్గుచేటు’’ అని  నేతలు విమర్శించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని