Atchannaidu: రూ.34వేల కోట్ల బీసీ నిధులు దారి మళ్లించారు: అచ్చెన్నాయుడు

రూ.34 వేల కోట్ల బీసీ నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోత విధించారన్నారు.

Published : 26 Nov 2022 19:06 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రూ.34 వేల కోట్ల బీసీ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోత కోశారని మండిపడ్డారు. జగన్‌ తన నిర్ణయాలతో సుమారు 16 వేల పదవులకు బీసీలకు దూరం చేశారన్నారు. బీసీల నుంచి 8వేల ఎకరాల అసైన్డ్‌ భూములను లాక్కున్నారని ఆరోపించారు. 26 మంది బీసీ నేతలను వైకాపా నేతలు హత్య చేశారని, మరో 650మందిపై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఆదరణ పథకం, బీసీలకు విదేశీ విద్య, వివాహ కానుకలు రద్దు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని