Atchannaidu: తెదేపాకు, చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటా

వెనకబడిన వర్గాలకు చెందిన తనకు ఇన్నాళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

Published : 17 Jun 2024 06:40 IST

ఇన్నాళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
కొత్త అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు
వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: వెనకబడిన వర్గాలకు చెందిన తనకు ఇన్నాళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 164 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు విజయకేతనం ఎగరవేసేలా పార్టీ శ్రేణులు అహర్నిశలు పడ్డ కృషిలో తానూ పాలుపంచుకున్నానని గుర్తు చేసుకున్నారు. ‘‘పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నా. నా జీవితాంతం తెదేపాకు, చంద్రబాబుకు రుణపడి ఉంటా. నా తుది రక్తపు బిందువు వరకూ తెదేపాకే జీవితం అంకితం. నిరంకుశత్వ, అరాచక, రౌడీ రాజకీయాల నుంచి ఏపీ భవిష్యత్తును, రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న తెదేపాకు, చంద్రబాబుకు, పార్టీ నేతలకు నా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా మనమంతా ముందుకు సాగుదాం. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దాం. నాపై నమ్మకంతో కోట్ల మంది రైతులకు సేవ చేసేందుకు అప్పగించిన వ్యవసాయ శాఖను విజయవంతంగా నిర్వహించి.. దేశంలోనే మంచి పేరు తీసుకొస్తా’’ అని అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని