Andhra News: వారి వివరాలు సేకరించాం.. తగిన మూల్యం చెల్లించక తప్పదు: అచ్చెన్నాయుడు

మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 24 May 2022 15:07 IST

అమరావతి: మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెప్తున్నారని ఆక్షేపించారు. మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని ప్రైవేటు వాహనాల యజమానులను ఆర్టీవోలు భయపెడుతున్నారని తెలిపారు. అలా బెదిరించిన అధికారుల వివరాలు సేకరించామని.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న హెచ్చరించారు. గత 40ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున మహానాడుకు శ్రేణులు సమాయత్తమవుతున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండులా తెదేపా కార్యకర్తలు మహానాడుకు పోటెత్తడం ఖాయమన్నారు. మూడేళ్ల ప్రభుత్వ అరాచక పాలనపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అందుకే మహానాడు విజయవంతం కాకుండా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని