అందరం రాజీనామా చేద్దాం: అచ్చెన్న

విశాఖ ఉక్కు పరిశ్రమపై వైకాపా సర్కారు స్పందించలేదని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ

Published : 16 Feb 2021 01:21 IST

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమపై వైకాపా సర్కారు స్పందించలేదని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ సీఎం జగనే అని ఆయన ఆరోపించారు. విశాఖలో మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఉక్కు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. 

ఉక్కు పరిశ్రమ కోసం సీఎం జగన్‌ వెంట నడిచేందుకు సిద్ధమని.. అవసరమైతే అందరం కలిసి రాజీనామా చేద్దామని అచ్చెన్న పిలుపునిచ్చారు. సీఎం నాయకత్వం వహిస్తే వెంట నడిచేందుకు మేం సిద్ధమన్నారు. ‘ఉక్కు’ పోరులో రాజీనామా చేసిన ఎంపీల స్థానాల్లో పోటీ పెట్టబోమని హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని