Atmakur bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక : 15 రౌండ్లు పూర్తి.. 60 వేలు దాటిన వైకాపా ఆధిక్యం

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ...

Updated : 26 Jun 2022 11:12 IST

ఆత్మకూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 20 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేశ్‌కుమార్, రిటర్నింగ్ అధికారి హరేంధిర పరిశీలిస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్‌ 23వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్‌ జరిగింది. వైకాపా నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మరో 12 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.

15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఫలితాలు ఇలా ఉన్నాయి...

*వైకాపా : 76,096
*భాజపా : 14,289
*బీఎస్పీ : 3,794
*నోటా : 3,159

15 రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్‌పై 61,807 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని