Andhra News: తెదేపా నేత జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్లదాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై బుధవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది.

Updated : 23 Nov 2022 20:17 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై బుధవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత 3 రోజులుగా తాడిపత్రి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో అస్మిత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం నుంచి 3వ వార్డులో  పర్యటిస్తున్నారు. ఈక్రమంలో వైకాపా కౌన్సిలర్‌ ఫయాజ్‌ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్దకు రాగానే పథకం ప్రకారం విద్యుత్‌ సరఫరా నిలిపివేసి.. ఇళ్లపై నుంచి కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. తెదేపా కార్యకర్తలు ప్రతిఘటించేందుకు రాళ్లతో వారు సైతం దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాళ్ల దాడి నుంచి తప్పించుకున్న జేసీ అస్మిత్‌రెడ్డి ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని