Updated : 02 May 2022 18:26 IST

KA Paul: కేఏ పాల్‌పై దాడి.. రైతుల పరామర్శకు వెళ్తుండగా ఘటన

సిరిసిల్ల గ్రామీణం: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైదరాబాద్‌ నుంచి బస్వాపూర్‌ బయలుదేరారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు కేఏ పాల్‌ను అడ్డుకున్నారు. దీంతో తనను ఎందుకు అడ్డుకున్నారని కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాల్‌పై దాడి చేశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పాల్‌ డిమాండ్‌ చేశారు. తనను హత్య చేసేందుకు తెరాస శ్రేణులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఘటన తర్వాత  పోలీసులు.. కేఏ పాల్‌ను పోలీసులు తిరిగి హైదరాబాద్‌ పంపించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని