Palnadu: తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు

తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Published : 03 Oct 2023 20:08 IST

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపై (Julakanti Brahma Reddy) పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆగస్టు 30న వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే తెదేపా కార్యకర్తలపై 307తోపాటు మరికొన్ని సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ10గా ఉన్న మధు యాదవ్‌ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌ రిపోర్టులో జూలకంటి పేరును ఏ-12గా చేర్చారు. జూలకంటి చెప్పడం వల్లే మధు హత్యాయత్నం చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని