Ayyanna patrudu: నర్సీపట్నం వచ్చేయ్‌ తేల్చుకుందాం.. విజయసాయిరెడ్డికి అయ్యన్న సవాల్‌

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారంటూ మున్సిపల్‌

Published : 24 Jun 2022 18:11 IST

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారంటూ మున్సిపల్‌ అధికారులు అయ్యన్న ఇంటి ప్రహరీని ధ్వంసం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ అయ్యన్న అనుచరులు, తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో నర్సీపట్నంలో పోలీసులు మోహరించారు. గోడ కూల్చొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. దీనికి తోడు ఇటీవల చోడవరంలో జరిగిన మినీ మహానాడులో ప్రభుత్వంపై విమర్శలు చేశారని అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు గురువారం విశాఖ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. 6 రోజుల క్రితం గుంటూరు పోలీసులు కూడా నోటీసు సెక్షన్‌ 41 కింద నోటీసు ఇచ్చేందుకు వచ్చారు. అయ్యన్న అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. 

ఈ నేపథ్యంలో ఇవాళ అయ్యన్నపాత్రుడు చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయంశంగా మారింది.  ‘‘నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉంది. జేసీబీలు, ఐపీఎస్‌లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్‌ మీడియా కేసులు. అంత భయం ఎందుకు విజయసాయిరెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్‌ తేల్చుకుందాం’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు