Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత

తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Updated : 29 Jan 2023 08:17 IST

విజయవాడ: తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు స్టంట్‌ వేశారు. బీపీ ఎక్కువగా ఉన్నందున ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. ఎప్పటికప్పుడు అర్జునుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు