Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం: బాలకృష్ణ
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు (Chandrababu Arrest) అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పష్టం చేశారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు (Chandrababu Arrest) అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పష్టం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. ప్రజల్లో తెలుగుదేశానికి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం శాసనసభాపక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండాగా చట్టసభలకు వెళ్తున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టంచేశారు. చేసిన తప్పునకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే.. మరే అంశమైనా తీసుకోవాలన్నారు.
సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెలుగుదేశం శాసనసభపక్షం నిరసనలో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ‘చంద్రబాబుపై కక్ష - యువత భవితకు శిక్ష’ అంటూ ఎమ్మెల్యేలు ప్లకార్డుల ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
-
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?