Bandi Sanjay: కేసీఆర్‌కి రాజకీయాలు తప్ప పేదల బాధలు పట్టవు: బండి సంజయ్‌

తెలంగాణ ప్రభుత్వం రికార్డు కోసం గంటలో 34 కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

Updated : 31 Aug 2022 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రికార్డు కోసం గంటలో 34 కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మహిళలకు ఆపరేషన్‌ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘కు.ని చికిత్సలతో నలుగురు మహిళల మృతికి తెరాస ప్రభుత్వమే కారణం. మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించకుండా బిహార్‌ పర్యటనకు వెళ్లారు. కేసీఆర్‌కి రాజకీయాలు తప్ప పేదల బాధలు పట్టవు. ఈ 8 ఏళ్లలో కేసీఆర్‌ ఒక్క పేద కుటుంబాన్ని అయినా పరామర్శించారా?మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదు? వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అబద్ధాల మంత్రిగా మారిపోయారు. కు.ని.చికిత్సలతో మృతిచెందిన మహిళల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలి’’ అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని