కేసీఆర్‌కు వైద్యుల్ని పిలిచి చర్చించే ధైర్యం లేదా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన సమయంలో స్పందించి ఉంటే జూడాలు, రెసిడెంట్‌ వైద్యులు సమ్మె చేసేవారే కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి

Published : 27 May 2021 00:19 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన సమయంలో స్పందించి ఉంటే జూడాలు, రెసిడెంట్‌ వైద్యులు సమ్మె చేసేవారే కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ముఖ్యమంత్రికి డాక్టర్లను పిలిచి చర్చలు జరిపే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి పడుతుంటే ఖాళీలను ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. సమ్మెకు సీఎం బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కరోనాతో చనిపోయిన ఎంత మంది సిబ్బందికి ఎక్స్‌గ్రేషియో చెల్లించారో సమాధానం చెప్పాలన్నారు. అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా వైద్యులు విధులు నిర్వర్తిస్తే వారిపక్షాన నిలబడి భాజపా పోరాడుతుందని సంజయ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని