TS Budget: తెలంగాణ బడ్జెట్.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget 2023) అంతా డొల్ల బడ్జెట్ అని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) ఎద్దేవా చేశారు. ఇది ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని విమర్శించారు. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలేనని పేర్కొంటూ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపేలా ఉందన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు.
ప్రతిపాదిత బడ్జెట్‌లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. ‘మాటలు కోటలు దాటుతున్నయ్.. చేతలు గడప దాటడం లేదు’అనే సామెతకు అద్దం పడుతోందన్నారు. యావత్ దళిత సమాజాన్ని మోసం చేసేదిగా బడ్జెట్ ఉందన్నారు. ఈసారి కూడా బీసీ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతున్నట్లు అర్థమవుతుందని దుయ్యబట్టారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చూస్తుంటే మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు ఉండడం దారుణమన్నారు. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి చెల్లిస్తున్న రూ.2.63 లక్షల సొమ్మును తన ఖాతాలో వేసుకోవడానికి బడ్జెట్‌లో నిధులను చూపినట్లు అర్థమవుతోందన్నారు. రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపిందని.. మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్‌లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందని.. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకంతోపాటు అప్పుల ద్వారా, ప్రజలపై భారం మోపడం ద్వారా మాత్రమే సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ డొల్ల బడ్జెట్‌ను భాజపా పక్షాన ప్రజల్లో ఎండగడతామని సంజయ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
Movies News
Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ రేంజ్లో సూర్య మూవీ ఉంటుందట!
-
World News
Lottery: రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!
-
Sports News
IND vs PAK: మోదీజీ.. భారత్- పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూడండి: షాహిది అఫ్రిది