Bandi Sanjay: ఆ ఘటనలపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలి: బండి సంజయ్

నిజాం కాలం నాటి అరాచకాలను తెరాస నేతలు ఇప్పుడు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Updated : 20 Apr 2022 17:59 IST

మల్దకల్‌: నిజాం కాలం నాటి అరాచకాలను తెరాస నేతలు ఇప్పుడు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఖమ్మంలో తెరాస నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ పోరాడారని చెప్పారు. పోలీసుల వేధింపులు తాళలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ వద్ద శిబిరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

సాయిగణేశ్‌ వాంగ్మూలాన్ని పోలీసులు ఎందుకు తీసుకోలేదని సంజయ్‌ ప్రశ్నించారు. అతడికి ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని.. పోలీసులు ప్రణాళిక ప్రకారమే చేశారన్నారు. రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడి ఆత్మాహుతి, కోదాడ అత్యాచార ఘటన, వామనరావు దంపతుల హత్య వెనుక ఉన్నది తెరాస నేతలేనని సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనలపై సీఎం కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలని.. ఆయనే బయటకు వచ్చి వీటిని ఖండించాలని డిమాండ్‌ చేశారు. భాజపా తరఫున న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని