Telangana News: కేంద్రం నిధులను.. తెరాస పథకాలుగా చెప్పుకుంటున్నారు: బండి సంజయ్‌

కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 24 Apr 2022 13:48 IST

నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కొలువులు, నిరుద్యోగ భృతి అంటూ హామీలిచ్చిన కేసీఆర్‌ అన్నీ మరచి కుటుంబసభ్యులకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజైన ఇవాళ బండి సంజయ్‌ నారాయణపేటలో పర్యటించారు.

ఆరు నెలల్లో ఆర్‌డీఎస్‌ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందన్న ఆయన ఎనిమిదేళ్లుగా తెరాస సర్కారు కాలయాపన చేసిందన్నారు. కేసీఆర్‌.. మూడు ఎకరాల భూమి, దళితబంధు అంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో చిన్న రోడ్లకు కూడా మరమ్మతులు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని