Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌కు మధ్య ట్విటర్‌లో మాటల యుద్ధం కొనసాగింది. కేటీఆర్‌ భాజపా, మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. దానికి దీటుగా స్పందిస్తూ బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 30 Mar 2023 19:42 IST

హైదరాబాద్‌: తెలంగాణకు ఏమీ ఇవ్వని భాజపా, మోదీ మనకెందుకు అని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వనప్పుడు కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎందుకు భరించాలి? సహించాలి? అని ప్రశ్నించారు. తన పార్టీ నుంచే తెలంగాణ పేరును తొలగిస్తే.. కేసీఆర్‌ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదని పేర్కొన్నారు. ఉద్యమకారులకు పార్టీలో చోటు, దళితులకు మూడెకరాలు, దళిత సీఎం, ఉద్యోగ  నియామకాలు , నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, పంచాయతీ, మున్సిపాలిటీలకు, ఆలయాలకు నిధులు ఇవ్వని కేసీఆర్‌ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదు? అని సంజయ్‌ ప్రశ్నించారు.

కేసీఆర్‌ కుటుంబంపై సెటైరికల్‌ ట్వీట్‌..

అంతకు ముందు సీఎం కేసీఆర్‌ కుటుంబంపై బండి సంజయ్‌ సెటైరికల్‌గా మరో ట్వీట్‌ చేశారు. దేశంలో అత్యధిక వేతనం రూ.4.1 లక్షలు తీసుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఆయన కుమారుడు కేటీఆర్‌ పరువు నష్టం విలువ రూ.100 కోట్లు అని, కుమార్తె కవిత వాచ్‌ ధర రూ.20లక్షలు అని విమర్శించారు. మరి ఈ రాష్ట్రంలో కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలు, ర్యాగింగ్ భూతానికి బలైన బాధితులు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగుల విలువ ఎంత? అని సంజయ్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు