Bandi sanjay: పాలమూరు సభలో కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలే: బండి సంజయ్‌

పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.  పాలమూరు జిల్లాలో వలసలు లేవని కేసీఆర్‌ చెప్పటం అవాస్తవమన్నారు.

Published : 04 Dec 2022 20:40 IST

నిర్మల్‌: పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవని కేసీఆర్‌ చెప్పటం అవాస్తవమన్నారు. తమతో కలిసి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారా? అని ప్రశ్నించారు. కుమార్తె కవితను మద్యం కేసు నుంచి తప్పించడం కోసమే కేసీఆర్‌ ఆలోచన అని ఎద్దేవా చేశారు.  అందుకే మరో తెలంగాణ తరహా ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ ప్రభుత్వమని..  కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరన్నారు. తెలంగాణలో గడీల పాలనను అంతం చేయడానికే భాజపా ప్రజల ముందుకొచ్చిందన్నారు. నిర్మల్‌ జిల్లాలో బండి సంజయ్‌ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏడో రోజు ఉత్సాహంగా సాగింది. నిర్మల్‌ రూరల్‌ మండలం చిట్యాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంగపేట్‌, ఈద్గావ్‌ క్రాస్‌ రోడ్స్‌, శివాజీ చౌక్‌, శాంతినగర్‌ పీవీ విగ్రహం, కండ్లి వరకు 11.5 కి.మీ మేర సాగింది. భాజపా శ్రేణులు ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. చిట్యాల బ్రిడ్జి వద్ద మాజీ కౌన్సిలర్‌ నూతుల భూపతిరెడ్డి స్వర్ణవాగులు తెప్పపై నిల్చుని బండి సంజయ్‌ యాత్రకు స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని