Bandi Sanjay: జేబీఎస్‌ వద్ద నిరసనకు భాజపా ప్లాన్‌.. బండి సంజయ్‌ హౌస్‌ అరెస్ట్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్‌ వద్ద నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.

Updated : 10 Jun 2022 09:34 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్‌ వద్ద నిరసనకు ఆయన పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్‌ వద్ద నిరసన కార్యక్రమానికి భాజపా నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా బండి సంజయ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టి సంజయ్‌ బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసుల తీరుపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని.. జేబీఎస్‌లో నిరసన చేసి తీరుతామని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు