Telangana News: మిగతా పోస్టులకు నోటిఫికేషన్‌ ఎప్పుడు?: బండి సంజయ్‌

ఎనిమిదేళ్ల తెరాస పాలనలో కేవలం పోలీసు పోస్టులనే భర్తీ చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తారని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖలో

Updated : 26 Apr 2022 12:50 IST

సీఎం కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: ఎనిమిదేళ్ల తెరాస పాలనలో కేవలం పోలీసు పోస్టులనే భర్తీ చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పోలీస్‌శాఖలో కాకుండా మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తారని సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

‘‘ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మీ నియంత పాలనకు అడ్డురాకూడదనే పోలీసు పోస్టుల భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల హామీ మేరకు మూడున్నరేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.1.20లక్షల భృతి చెల్లించాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కాలయాపన చేయకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలి. విధుల నుంచి తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి తీసుకోవాలి’’ అని బండి సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని