Telangana News: కేసీఆర్‌ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బండి సంజయ్‌

పాలమూరు జిల్లా పరిస్థితి చూస్తుంటే బాధాకరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌

Updated : 03 May 2022 21:31 IST

దేవరకద్ర: పాలమూరు జిల్లా పరిస్థితి చూస్తుంటే బాధాకరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. ఆర్డీఎస్‌ను ఆధునికీకరిస్తామన్న హామీని సీఎం కేసీఆర్‌ విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే ఆర్డీఎస్‌ను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. భాజపా అధికారంలోకి వస్తే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు సంపాదనే ముఖ్యం తప్ప.. రాష్ట్ర సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. దేవరకద్ర ప్రాంతంలో రాజ్యమేలుతోన్న తెరాస నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ‘‘పాలమూరు నుంచి వలసలు లేవని కేసీఆర్‌ మాట్లాడారు. పాలమూరులో వలసలు లేవని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. వలసలు ఉన్నాయని నిరూపించడానికి నేను సిద్ధం. నా సవాలును స్వీకరించేందుకు కేసీఆర్‌ సిద్ధమా?దత్తత తీసుకున్న పాలమూరుకు కేసీఆర్‌ 8 ఏళ్లలో ఏం చేశారు?’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని