Bandi sanjay: భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్‌ సిద్ధమా?: బండి సంజయ్‌

పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస గూండాగిరి చేస్తోందని, తెరాస చేయించే దాడులకు భాజపా భయపడదని బండి సంజయ్‌

Published : 19 Aug 2022 01:38 IST

జనగామ: పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస గూండాగిరి చేస్తోందని, తెరాస చేయించే దాడులకు భాజపా భయపడదని బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో నిర్వహించిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఎర్రవాళ్లను, పచ్చవాళ్లను ఎవరిని తెచ్చుకున్నా తాము భయపడేది లేదన్నారు. భాజపాతో బల ప్రదర్శనకు కేసీఆర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. భాజపా హిందూ ధర్మం కోసం పనిచేస్తుందని, పేదల కోసం అవసరమైతే గూండాగిరి చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో కేంద్రం నిధులు ఉన్నాయని వివరించారు. భాజపా ఏ మతానికి, ప్రాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 80శాతం మంది ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితేనే  దేశాన్ని కాపాడుకోగలమన్నారు. ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని