Bandi sanjay: భారాస, కాంగ్రెస్‌కు తోడు సూది, దబ్బనం పార్టీలు: బండి సంజయ్‌ ఎద్దేవా

తెలంగాణలో  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated : 01 Apr 2023 22:12 IST

హైదరాబాద్‌:  తెలంగాణలో  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారాసతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌కు తోడుగా సూది, దబ్బనం పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయని ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేసిన విషయం వాస్తవమేనని సంజయ్‌ స్పష్టం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంపై చేసే ఉమ్మడి పోరాటంలో కాంగ్రెస్‌ ఉంటే తాము రాలేమని షర్మిలతో చెప్పినట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కుమార్తె, కుమారుడిని కాపాడేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని సంజయ్‌ దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు