Bandi Sanjay: కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్‌నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

విద్యుత్‌ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌నే కేసీఆర్‌ తప్పుపడతారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Updated : 15 Jun 2024 21:14 IST

హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌నే కేసీఆర్‌ తప్పుపడతారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఈమేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘విచారణ కమిటీ ఛైర్మన్‌ వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికీ ధిక్కరణే. కమిషన్‌ ఏర్పాటే తప్పయితే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? 

అక్రమాలకు పాల్పడకపోతే విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వాస్తవాలెందుకు వివరించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో జస్టిస్‌ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించిన సంగతి మర్చిపోయారా? మీ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ ఎంతకైనా తెగిస్తారనడానికి ఫోన్‌ ట్యాపింగ్‌ నిదర్శనం. కోర్టు పరిధిలో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్ అంశంపై అడ్డగోలుగా మాట్లాడి సుప్రీంకోర్టు ద్వారా చీవాట్లు తిన్న నేత కేసీఆర్‌. విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీపై విచారణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం జాప్యం చేయడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. కేసీఆర్‌ సహా బాధ్యులను అరెస్టు చేసి వాస్తవాలను ప్రజల ముందుంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’’ అని బండి సంజయ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని