Telangana News: తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధం: బండి సంజయ్‌

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను

Updated : 12 Apr 2022 17:38 IST

హైదరాబాద్: ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈనెల 14 నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. ఇటీవల పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈనెల 7 నుంచి 20 వరకు ‘సామాజిక న్యాయ పక్షం’ పేరుతో చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రైతు సదస్సులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వంటి అంశాలపై సమీక్షించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో చర్చించారు.

తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రైతుల ముసుగులో తెరాస దాడులు చేసినా భాజపా కార్యకర్తలు, నాయకులంతా ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని బండి సంజయ్‌ సూచించారు. సీఎం ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తెరాస ప్రభుత్వ నియంత.. అవినీతి.. కుటుంబ పాలనను పూర్తి స్థాయిలో ఎండగడతామని బండి సంజయ్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని