ts News: ప్రధాని మోదీ ఫోన్‌ చేసి చెప్పారు.. తగ్గేదేలే..: బండి సంజయ్‌

ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లక తప్పదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 317 జీవోకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో

Updated : 11 Jan 2022 19:58 IST

మహబూబ్‌నగర్‌: ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లక తప్పదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 317 జీవోకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్‌ పాల్గొని ప్రసంగించారు. 317 జీవోను సవరించే వరకు భాజపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌, కుటుంబం అవినీతిపై విచారణలు జరుగుతాయని పేర్కొన్నారు. విచారణల భయం వల్లే జాతీయ కూటమి అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే భాజపా లక్ష్యమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గవద్దని ప్రధాని మోదీ ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. కొవిడ్‌ కంటే అతి ప్రమాదకరమైన వైరస్‌ కేసీఆర్‌ అని బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా నేతలు మురళీధర్‌రావు, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితరులు సభలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని