కేసీఆర్‌ దిల్లీ వైపు చూస్తున్నారనగానే.. ఇండియాగేట్‌ వద్ద బతుకమ్మ వెలుగుతోంది: కవిత

సీఎం కేసీఆర్‌ కేంద్రం వైపు చూస్తున్నారనగానే దిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద బతుకమ్మ వెలుగుతోందని

Updated : 27 Sep 2022 21:34 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కేంద్రం వైపు చూస్తున్నారనగానే దిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద బతుకమ్మ వెలుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం దిల్లీలో ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేదన్నారు. భాజపా హైదరాబాద్‌లో పటేల్‌ను పట్టుకొని విమోచనం అంటోందని, అదే పటేల్‌ విగ్రహంతో గుజరాత్‌లో యూనిటీ అని చెబుతోందన్నారు. విభజన కావాలో... ఐక్యత కావాలో భాజపా తేల్చుకోవాలని, యువత కూడా ఆలోచించాలని కవిత అన్నారు. తెరాస ఆవిర్భావం తర్వాతే తెలంగాణ పండుగలు, పద్ధతులు, యాస, భాషకు గౌరవం దక్కిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ, బోనాల వంటి పండుగలను కేసీఆర్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గౌరవాన్ని పెంచిందన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని