Bengal: కొలువుదీరిన మంత్రివర్గం

పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గం కొలువుదీరింది. 43 మంత్రులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ మేరకు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 43 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రమాణం చేయించారు....

Published : 10 May 2021 16:38 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గం కొలువుదీరింది. 43 మంత్రులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ మేరకు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 43 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రమాణం చేయించారు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సుబ్రతా ముఖర్జీ, పార్థ ఛటర్జీ, జ్యోతి ప్రియాంకా మాలిక్‌ సహా పలువురు ప్రధాన నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఐపీఎస్‌ మాజీ అధికారి హుమాయున్‌ కబీర్‌, మాజీ క్రికెటర్‌ మనోజ్‌కుమార్‌ తివారీతోపాటు మరో 14 మంది కొత్తవారికి దీదీ మంత్రివర్గంలో అవకాశం లభించింది. మొత్తం 43 మంది ఉన్న మంత్రి మండలిలో.. 24 మందికి కేబినెట్ పదవులు దక్కగా 10 మందికి స్వతంత్ర్య హోదా లభించింది. మరో 9 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం మమతా బెనర్జీ తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. 

మే 2వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) విజయ ఢంకా మోగించింది. బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహించిన  292 అసెంబ్లీ స్థానాలకు గానూ 213 స్థానాల్లో విజయం సాధించింది.  ఫలితాల అనంతరం ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని