
Bhabanipur by poll: బెంగాల్లో హింస తలెత్తకుండా వారికి ఆదేశాలు ఇవ్వండి
కలకత్తా హైకోర్టు సీజేకు భవానీపూర్ భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ లేఖ
కోల్కతా: భవానీపూర్ సహా పశ్చిమ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ ఆదివారం కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఏడాది మే నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయాన్ని టిబ్రివాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
‘ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ అంతటా మారణకాండ జరగడాన్ని చూశాం. ఇది యావత్ దేశాన్ని షాక్కు గురిచేసింది. టీఎంసీ శ్రేణుల దుశ్చర్యల పరిణామాలను నేటికీ అనుభవిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎలాంటి హింస, ప్రాణనష్టాలకు అవకాశం లేకుండా కోల్కతా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో భవానీపూర్ స్థానంలో మమత ఆధిక్యంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.