Punjab Election 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీ భగవంత్ మన్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆప్
93శాతం మంది ఆయననే ఎన్నుకున్నారన్న కేజ్రీవాల్
చండీగఢ్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీ భగవంత్ మాన్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం అభ్యర్థి కోసం ప్రజలతో టెలీఓటింగ్ నిర్వహించింది. ఇందులో 93శాతం మంది భగవంత్ మాన్నే సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఒరవడికి తెరతీసింది. ‘‘ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను మూడు కోట్ల పంజాబ్ ప్రజలకే వదిలేశాం. వారు జనవరి 17వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని గుర్తించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి’ అని కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. ఆ వెంటనే ఆప్ 7074870748 నంబరును అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబరుకు కాల్/మెసేజ్/వాట్సాప్ చేసి ప్రజలు తమకు నచ్చిన నేతను సీఎం అభ్యర్థిగా ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది.
కాగా.. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 21.59లక్షల స్పందనలు వచ్చినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో 93.3శాతం మంది భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు కేజ్రీవాల్ నేడు ప్రకటించారు. టెలీఓటింగ్లో మరో 3శాతం మంది నవజోత్ సింగ్ సిద్ధూకు ఓటేయగా.. కొందరు కేజ్రీవాల్‌ను ఎంచుకొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దీంతో భగవంత్ మాన్‌ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ స్పందన చూస్తుంటే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తప్పకుండా విజయం సాధిస్తుందని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే పంజాబ్ తదుపరి సీఎం అవుతారు’’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
48ఏళ్ల భగవంత్ మాన్.. సంగ్రూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆప్ పంజాబ్ యూనిట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించగానే భగవంత్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఒకప్పుడు కమెడియన్‌గా ప్రజలు నన్ను చూసి నవ్వేవారు. ఇప్పుడు అదే ప్రజలు ఏడుస్తూ తమను కాపాడమని వేడుకొంటున్నారు’’ అని మాన్ చెప్పుకొచ్చారు.
పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 117 శాసనసభ నియోజకవర్గాలున్న పంజాబ్‌లో 2017 ఎన్నికల్లో 77 సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. 20 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అకాలీదళ్‌కు 15, భాజపాకు 3 సీట్లు దక్కాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ ఆప్ గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్‌సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్ రాణా
మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్ రాణాకు భాజపా లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది. -
అరుణాచల్ సీఎం ఖండూ ఎన్నిక ఏకగ్రీవం!
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ, నలుగురు భాజపా నేతలున్నారు. -
ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్‌ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ