Published : 07/12/2020 00:51 IST

భారత్‌ బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్‌బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తెరాస శ్రేణులు ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని కేసీఆర్ వారిని సమర్థించారు. ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందు వల్లే తెరాస వాటిని పార్లమెంటులో వ్యతిరేకించిందని సీఎం గుర్తుచేశారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌బంద్‌ విజయవంతానికి తెరాస కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు
మరోవైపు భారత్‌బంద్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ మద్దతిస్తున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పొల్గొనాలని ఆయన సూచించారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపరిధిలోనూ ప్రత్యేక వ్యవసాయ చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి

రైతుల ఉడుంపట్టు

 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని