Bharat Jodo Yatra: సంగారెడ్డి జిల్లాలో సరదాగా రాహుల్‌ జోడోయాత్ర

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జోడో యాత్ర సరదాగా సాగింది. చిన్నారులతో క్రికెట్‌ ఆడుతూ, పాఠశాల విద్యార్థులతో చేతులు కలుపుతూ సరదాగా పాదయాత్ర సాగించారు.

Published : 03 Nov 2022 14:13 IST

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జోడో యాత్ర సరదాగా సాగింది. గురువారం పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్‌ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. చిన్నారులతో క్రికెట్‌ ఆడుతూ, పాఠశాల విద్యార్థులతో చేతులు కలుపుతూ సరదాగా పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు వారి సంప్రదాయ వేషధారణలో రాహుల్‌కు అడుగడుగునా స్వాగతం పలికారు. రాహుల్‌ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలికారు. దివ్యాంగులకు రాహుల్‌ చేతుల మీదుగా వీల్‌ఛైర్లను అందజేశారు. అనంతనం రామ్‌మందిరం సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబానికి సంబంధించి ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను రాహుల్‌ తిలకించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్‌ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని