Bhatti Vikramarka: ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు

‘అప్పులు తెస్తాం.. సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రజలకు పంచుతాం’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు.

Published : 20 Jun 2024 06:30 IST

జగదీశ్‌రెడ్డి కోరడంవల్లే విద్యుత్‌పై న్యాయ విచారణ
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: ‘అప్పులు తెస్తాం.. సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రజలకు పంచుతాం’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘విద్యుత్‌ కొనుగోలు అంశంపై శ్వేతపత్రం విడుదల చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి న్యాయ విచారణ జరపాలని పదేపదే కోరడం వల్లనే సభానాయకుడు రేవంత్‌రెడ్డి అంగీకరించారు. ఇప్పుడు విచారణ అంటే భారాస నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో, భయపడుతున్నారో అర్థం కావడం లేదు. ఇంజినీర్లను కాదని అంతా తానేనని కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిపోయింది. మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభమవుతాయి. రాహుల్‌ గాంధీ ఆలోచనలు, ఆయన చూపిన మార్గాన్ని ముందుకు తీసుకువెళతాం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి సంపద, వనరులను పేదలకు పంచాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించిన నాయకులకు త్వరలోనే పదవులు ఇస్తాం. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు సొమ్ము ఇవ్వదని భారాస నేతలు ప్రచారం చేస్తే సొమ్ము జమచేసి చూపించాం’’ అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని