Telangana news: స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌పై కక్ష కట్టారు: భట్టి

రాష్ట్రంలో అకాల వర్షాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వరద నష్టంపై ఇప్పటివరకు

Updated : 09 Aug 2022 01:38 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో అకాల వర్షాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వరద నష్టంపై ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా వేయలేదని తెలిపారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోందని విమర్శించిన ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేవన్నారు. ఈ నెల 9 నుంచి 15 వరకు ప్రతి జిల్లాలో 75 కి.మీ.ల పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించిన నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌కు తాళం వేశారని ఆక్షేపించారు. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ నెల 16 నుంచి రెండు, మూడు రోజుల పాటు సీఎల్పీ బృందం భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. కడెం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని