Updated : 22/09/2020 17:02 IST

అన్నీ దొంగ లెక్కలే : సీఎల్పీనేత భట్టి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా్డుతూ.. నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని చెప్పారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లోని రెండు ప్రాంతాల్లో 226 ఇళ్లు కట్టినట్టు చెప్పారు...ఆ జాబితాలోనూ అనేక అవకతవకలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ప్రతి అర్బన్‌ నియోజకవర్గానికి 10వేల చొప్పున రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని 2016-17లోనే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2.4లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. లక్ష ఇళ్లు కట్టామని దొంగ లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. నాంపల్లిలో నిర్మించిన ఇళ్లను పరిశీలించేందుకు భట్టి మీడియాతో కలిసి వెళ్లారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని