Bhatti Vikramarka: దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ: భట్టి విక్రమార్క

దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 19 Jun 2024 14:04 IST

హైదరాబాద్‌: దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్‌ రాబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తమ మొదటి ప్రాధాన్యమని భట్టి విక్రమార్క వివరించారు.

పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?: మంత్రి తుమ్మల

ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్‌ పామ్‌ పండిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని తెలిపారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. బహుళజాతి, ఇన్‌ఫ్రా కంపెనీలకు రూ.వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం ఉండకూడదని చెప్పారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని