Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 307 సెక్షన్‌ కింద ఆళ్లగడ్డలో ఆమెను అరెస్ట్‌ చేసి పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated : 17 May 2023 11:05 IST

ఆళ్లగడ్డ: మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 307 సెక్షన్‌ కింద ఆళ్లగడ్డలో ఆమెను అరెస్ట్‌ చేసి పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, తెదేపా నేత ఎ.వి.సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి గ్రామం దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. 

ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వర్గపోరు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అఖిలప్రియ వర్గీయుడు ఎ.వి.సుబ్బారెడ్డిని కొట్టడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత అక్కడే ఉన్న అఖిలప్రియ, ఇతర నాయకులు, పోలీసు అధికారులు క్షణాల్లో జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. ఈ ఘటన నేపథ్యంలోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని