Telangana News: కేసీఆర్‌ ప్రకటన స్వాగతిస్తున్నా... రేపు నేను కూడా టీవీ చూస్తా: కోమటిరెడ్డి

‘నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో రేపు కీలక ప్రకటన చేయబోతున్నా. రేపు ఉదయం 10గంటలకు అందరూ టీవీల ముందు కూర్చోండి’ అంటూ వనపర్తి సభలో తెలంగాణ ముఖ్యంత్రి

Updated : 08 Mar 2022 21:48 IST

హైదరాబాద్‌:  ‘నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో రేపు కీలక ప్రకటన చేయబోతున్నా. రేపు ఉదయం 10గంటలకు అందరూ టీవీల ముందు కూర్చోండి’ అంటూ వనపర్తి సభలో తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా.. సీఎం కేసీఆర్‌ ప్రటనపై భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 

‘‘రేపు నేను కూడా టీవీ చూస్తా... మీరు అసెంబ్లీలో ప్రకటన చేయగానే భువనగిరి వెళ్లి అక్కడ మీకు పాలాభిషేకం చేస్తా. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రూ.3,116లు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 40లక్షల మంది నిరుద్యోగులున్నారు.. వారు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. 37 నెలల బకాయిలు సీఎం ప్రకటిస్తారని ఆశిస్తున్నా. ఖాళీగా ఉన్న 1.90లక్షల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్‌ ఇస్తారని అనుకుంటున్నా. డీఎస్సీ నోటిఫికేషన్‌ రాక చాలా మందికి వయోపరిమితి దాటిపోయింది. అలాంటి వారికి... వయోపరిమితి సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా’’ అని కోమటిరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని