Bhuvaneshwari: నిజం గెలవాలి పర్యటనలో ప్రజల బాధలు చూశా.. ఇప్పుడు సంతోషం చూస్తున్నా: భువనేశ్వరి

నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజల బాధలు చూశానని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని  నారా భువనేశ్వరి తెలిపారు. 

Updated : 18 Jun 2024 18:57 IST

అమరావతి: నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజల బాధలు చూశానని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని  నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అన్నీ మంచిరోజులే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువుదీరనున్న గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మట్లాడుతూ.. తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారన్నారు. 

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ.. తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారని తెలిపారు. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తుండటం తమ మనసుకు సంతోషాన్నిస్తోందని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని, రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందని తేల్చి చెప్పారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నేరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన ఫొటోలను భువనేశ్వరి ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు