Published : 03/12/2021 01:27 IST

Aiadmk: అన్నాడీఎంకేలో ఎన్నికలు.. పార్టీ శ్రేణులకు శశికళ లేఖ!

చెన్నై: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో కోఆర్డినేటర్‌, కో-కోఆర్డినేటర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. గతంలో అన్నాడీంకే జనరల్‌ సెక్రటరీగా దివంగత నేత జయలలిత ఉండేవారు. ఆమె మరణాంతరం ఆ పోస్టును భర్తీ చేయకుండా.. కోఆర్డినేటర్‌, కో-కోఆర్డినేటర్‌ పదవులు సృష్టించారు. ప్రస్తుతం ఆ పదవుల్లో ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం కొనసాగుతున్నారు. గతంలో ఈ రెండు పదవులకు పోటీ పడే అభ్యర్థులను పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు మాత్రమే ఎన్నుకునేవారు. ఇప్పుడు పార్టీ సభ్యత్వం ఉన్న 1.5కోట్ల మంది నేతలు, కార్యకర్తలకు ఎన్నుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 7న ఈ ఎన్నికలు జరగనున్నట్లు బుధవారం ప్రకటించారు. 

పార్టీ శ్రేణులకు శశికళ లేఖ

అన్నాడీఎంకేలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పార్టీ నేతలకు, కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. తనలా అకారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలంతా కొన్ని రోజులు సహనం వహించాలని కోరారు. త్వరలోనే పార్టీ స్థితిగతులు మారబోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికీ శశికళ తనను తాను అన్నాడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా చెప్పుకుంటుంటారు. పార్టీ జెండాలున్న కారుల్లోనే పర్యటిస్తున్నారు. పార్టీలోనూ శశికళను అభిమానించే నాయకులు కొందరు ఉన్నారు. దీంతో అన్నాడీఎంకే అంతర్గత ఎన్నికలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. 

Read latest Political News and Telugu News

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని