Parliament: భాజపా.. విపక్ష ఎంపీల పోటాపోటీ నిరసన!

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు 12 మంది రాజ్యసభ విపక్ష ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల్లో దురుసుగా ప్రవర్తించినందుకుగానూ వారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో తమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని పార్లమెంట్‌ ప్రాంగణంలో ఆ ఎంపీలంతా ఆందోళన చేస్తున్నారు. అయితే, ఇవాళ

Published : 03 Dec 2021 14:23 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభయ్యే ముందు పార్లమెంట్‌ ప్రాంగణంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన రాజ్యసభ ఎంపీలు పోటాపోటీగా నిరసనకు దిగారు. సమావేశాల తొలిరోజు 12 మంది విపక్ష ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల్లో దురుసుగా ప్రవర్తించినందుకుగానూ వారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో తమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వారంతా పార్లమెంట్‌ ప్రాంగణంలో ఆందోళన చేస్తున్నారు. అయితే, ఇవాళ విపక్ష ఎంపీలకు పోటీగా భాజపా ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. వారి ధర్నాను నిరసిస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. గత వర్షాకాల సమావేశంలో ఎంపీలు హింస్మాతక ధోరణితో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు.

భాజపా నిరసనపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ స్పందిస్తూ ‘‘భాజపా ఎంపీలు నిరసన తెలుపుతూ విపక్షాలను అనవసరంగా రెచ్చగొట్టి.. పుండు మీద కారం జల్లుతున్నారు. అధికార దుర్వినియోగం చేస్తోన్న పార్టీ.. మా సహ ఎంపీలను అన్యాయంగా బహిష్కరించింది’’అని మండిపడ్డారు. 

12 మంది ఎంపీలు.. ఫూలోదేవి నేతం (కాంగ్రెస్‌), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్‌ బోరా (కాంగ్రెస్), రాజామణి పటేల్‌ (కాంగ్రెస్‌), అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), డోలా సేన్‌ (తృణమూల్‌), శాంతా ఛత్రీ (తృణమూల్‌),  ప్రియాంకా చతుర్వేది (శివసేన), అనిల్‌ దేశాయ్‌ (శివసేన), బినోయ్‌ విశ్వం (సీపీఐ), కరీం (సీపీఎం)పై శీతకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది. అయితే, వారు క్షమాపణ చెబితే.. సస్పెన్షన్‌ ఎత్తివేతపై ఆలోచిస్తామని కేంద్రం వెల్లడించగా.. అందుకు విపక్ష నేతలు నిరాకరించారు. అవసరమైతే సమావేశాలను బహిష్కరిస్తాం కానీ.. క్షమాపణ చెప్పబోమని స్పష్టం చేశారు.

Read latest Political News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని