
ప్రైవేటీకరణ ఆలోచన కాంగ్రెస్‌దే: సోము వీర్రాజు
తిరుపతి: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తొలుత కాంగ్రెస్ పార్టీదేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు పార్టీ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలో భారతీయ జనతా పార్టీ పలు సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ‘‘భాజపా వచ్చాకే దేశంలో అవినీతిని అరికట్టాం. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ.. కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను జైళ్లకు పంపించాం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన చేసింది మొదట కాంగ్రెస్ పార్టీనే. రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం’’ అని ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.