BJP: భాజపా జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కిషన్‌ రెడ్డి

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జులను భాజపా నియమించింది.

Published : 17 Jun 2024 16:01 IST

దిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భాజపా ఇన్‌ఛార్జులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని పలువురు కేంద్రమంత్రులు, సీనియర్‌ నేతలకు అప్పగించింది. ఇందులోభాగంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించింది. మహారాష్ట్రకు కేంద్రమంత్రులు భూపేందర్‌ యాదవ్‌ (ఇన్‌ఛార్జి), అశ్వనీ వైష్ణవ్‌ (సహ ఇన్‌ఛార్జి)లను నియమించిన భాజపా అధిష్ఠానం.. హరియాణాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(ఇన్‌ఛార్జి), త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్‌ కుమార్‌(సహ ఇన్‌ఛార్జి), ఝార్ఖండ్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(ఇన్‌ఛార్జి), అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(సహ ఇన్‌ఛార్జి)లను నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ

మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గెలుపే లక్ష్యంగా భాజపా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని